జిల్లా మెట్పల్లిలో సీడీపీవో పద్మ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అంగన్వాడీ కేంద్రాల తనిఖీల్లో అనుకూలంగా వ్యవహరించడానికి ఆమె రూ.63,000 డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
మెట్పల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని 21 అంగన్వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయకుండా, అనుకూలంగా వ్యవహరించడానికి ఒక్కో కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు రూ.3,000, మొత్తం రూ.63,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదు మేరకు న కార్యాలయ ఆవరణ వెలుపల ఫిర్యాదుదారుడి నుంచి రూ.63,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీడీపీవో పద్మను అరెస్టు చేసి, కరీంనగర్లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.












