సదాశివనగర్, 10 September
దళితులు నడిచిన నేలను పాలు, పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత హేయమైన చర్యగా షాద్నగర్ దళిత, గిరిజన సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కంప్యూటర్ యుగంలో కూడా కుల వివక్షను ప్రదర్శించే ఇలాంటి చర్యలు సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
*దళితులను అవమానిస్తే ఖబడ్దార్!* *దళితులు నడిచిన నేలను పాలు, పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత హేయమైన చర్య* షాద్నగర్: దళితులు నడిచిన నేలను పాలు, పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని షాద్నగర్ దళిత, గిరిజన సంఘాల నాయకులు అన్నారు. కంప్యూటర్ యుగంలో కూడా కుల వివక్షను ప్రదర్శించే ఇలాంటి చర్యలు సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ జిల్లా అధ్యక్షులు మూలే జనార్ధన్ మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నాయకులు సభకు హాజరై ప్రజా సమస్యలను లేవనెత్తాలని, వాటిపై ప్రభుత్వం చర్చించి పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు. అయితే ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ప్రతిపక్షాలు ఆ దిశగా కాకుండా గొడవలు సృష్టించడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. సీఐటీయూ నాయకుడు రాజు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సహించలేకపోతున్నారని విమర్శించారు. దళితులు నడిచిన నేలను పాలు, పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత నీచమైన చర్య అని అన్నారు. ఇది కేవలం కొంతమంది వ్యక్తులను అవమానించడం కాదని, యావత్ దళిత సమాజాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. కుల వివక్షకు తావులేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగపాగ జంగయ్య, బుచ్చన్న, అర్జున్, పరంజ్యోతి, క్రాంతికుమార్, రంగయ్య, ఎర్ర నరసింహులు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.. KP












