వేల్పూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
నందిపేట్ మండలానికి చెందిన ఎల్లేటి శివశంకర్ ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విశ్వకర్మ సంఘం నాయకులు ఆయనను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి అండగా నిలవడానికి పలు హామీలు ఇచ్చారు.
ప్రమాదంలో గాయపడిన శివశంకర్‌కు ఆర్థిక సాయం నందిపేట్: మండలానికి చెందిన ఎల్లేటి శివశంకర్ ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న విశ్వకర్మ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండీ కొండోజు నరసింహ చారి పరామర్శించారు. ఈ సందర్భంగా మహిపాల్ చారి మాట్లాడుతూ.. వెస్సో ట్రస్ట్ హైదరాబాద్, దాతల సహకారంతో శివశంకర్ కుటుంబానికి రూ.65 వేల ఆర్థిక సాయం అందేలా కృషి చేసినట్లు తెలిపారు. నరసింహ చారి మాట్లాడుతూ.. శివశంకర్ కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయినట్లు తెలిపారు. ఆయన భార్య అనూషకు బ్యాంగిల్స్ అండ్ జనరల్ స్టోర్ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే శివశంకర్ కుటుంబానికి కుట్టు మిషన్ అందించేందుకు కూడా కృషి చేస్తానని మహిపాల్ చారి తెలిపారు. తీవ్ర పేదరికంలో ఉన్న శివశంకర్ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదని, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నందున దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో విశ్వకర్మ మండల అధ్యక్షుడు నూనె గంగాధర్, శ్రీరామ్, సుదర్శన్, నారాయణ, గంగాధర్, నర్సయ్య పాల్గొన్నారు.












