నీ తోడు మేమున్నాం.. సలీంకు బాల్య మిత్రులు
రూ 92 వేలు ఆర్థిక సహాయం : వెంకటేశ్వర్లు యాదవ్
మిర్యాలగూడ సెప్టెంబర్ 10 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణం ఎన్ఎస్పి క్యాంపు కాలనీకి చెందిన సలీం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా గుండెపోటుకుగురై బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న టెన్త్ క్లాస్ బ్యాచ్ మెంట్ (బాల్యమిత్రులు) గురువారం సలీం కు పరామర్శించి, అతని ఆర్థిక పరిస్థితులను గమనించి, వెంటనే స్పందించిన బాల్య మిత్రులు ఫిజికల్ డైరెక్టర్ కన్నెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో మిత్ర బృందం అందరి చేయూతతో బాల్యమిత్రుడు సలీం కు 92,000 వేల రూపాయ లు ఆర్థిక సహాయం అందించి ఆదుకు న్నారు.మిత్రులందరికీ వెంకటేశ్వర్లు యాదవ్ ధన్యవాదాలు తెలియ జేశారు. ఈ కార్యక్ర మంలోప్రకాష్, కిషన్ నాయక్. కర్నాటి వెంకటేశ్వర్లు. ఖాసీం. గంజి యాదగిరి. సురేందర్ రెడ్డి కలీం. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.












