తానూర్, 10 September
మండలంలోని ఝరి బి గ్రామంలో పోలాల అమావాస్య వేడుకలను గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ పశువులకు ప్రత్యేకంగా స్నానం చేయించి, పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేశారు.
ఝరి బి గ్రామంలో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు మనోరంజని తెలుగు టైమ్స్ మండలంలోని ఝరి బి గ్రామంలో పోలాల అమావాస్య వేడుకలను గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ పశువులకు ప్రత్యేకంగా స్నానం చేయించి, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజలు నిర్వహించారు. వ్యవసాయంలో పశువుల పాత్ర ఎంతో కీలకమని, పశుసంపదను కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత అని గ్రామస్తులు తెలిపారు. పంటలు సమృద్ధిగా పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలాల అమావాస్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.












