లక్ష్మణచాంద, 11 September
చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తి భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారు.
చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తి భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారు. నిజాం నవాబుకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. కౌలు భూమిలో తాను పండించిన పంటను దేశముఖ్ రేపాక రామచంద్రారెడ్డి తన అనుచరులతో తరలించుకుపోవడానికి ప్రయత్నించగా వారిని తరిమి కొట్టారు. ఇదే సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికింది. 'బాంచన్ కాల్మొక్తా' అనే బతుకులను మార్చడానికి ఐలమ్మ జీవితం త్యాగం చేశారు. ఆమె వర్ధంతి సందర్భంగా అగ్రకుల దొరలపై పోరాటం చేసి అణగారిన వర్గాల ఆత్మగౌరవం చూపించిన చిట్యాల ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిద్దామని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న అన్నారు. మండల కేంద్రంలోని చిట్యాల ఐలమ్మ విగ్రహం వద్ద ఆమె వర్ధంతి సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ నాయకత్వంలో అణగారిన వర్గాల మహనీయులను గుర్తు చేస్తూ, వారి ఆత్మగౌరవ పోరాటాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో నింపే కార్యక్రమం తెలంగాణలో ప్రారంభమైందని, ఈ ఆత్మగౌరవం ప్రారంభమైన రోజున అణగారిన కులాలంతా రాజ్యంలో భాగస్వాములు అవుతామని స్పష్టం చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు నాయకత్వానికి ముందుకు వచ్చి సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ముద్రబోయిన వినేష్, సోషల్ మీడియా ఇన్చార్జి బొజ్జ అశోక్, మండల అధ్యక్షులు సుంకరి సురేష్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల సెక్రెటరీ బిమర్తి ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, ఓడ్నాల రాజేశ్వర్,రజక సంఘ నాయకులు భూమన్న తిరుపతి శ్రీనివాస్ మండల ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు












