ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన పొన్న లక్ష్మిదేవి అనే మహిళ మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా, వారు వెంటనే స్పందించి, హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, అహమద్ హుస్సేన్, ట్రెజరర్ భార్గవ సాయి, సతీష్ అంత్యక్రియలను పూర్తి చేశారు. చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంత్యక్రియలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తుందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. మా శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఈ క్రింది నంబర్లను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము: 82972 53484, 9182244150.











