మండలంలోని చించాల గ్రామంలో మహిళా సంఘాల కోసం రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సమైక్య భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ జరిగింది. మహిళా సంఘాలకు అన్ని రంగాల్లో అండగా ఉంటామని సర్పంచ్ దొడ్డికింది సర్వేశ్, ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్ లు తెలిపారు.
వీబీజీరామ్ జీ పథకం కింద మంజూరైన ఈ భవన నిర్మాణానికి సర్పంచ్, ఉపసర్పంచ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళా సంఘాల సభ్యులు నెలవారీ సమావేశాలు నిర్వహించుకోవడానికి ప్రత్యేక భవనం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక భవనానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ భవనాన్ని త్వరగా నిర్మాణం పూర్తిచేసి గ్రామ సమైక్య సభ్యులకు అప్పగిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మండల అధికారులు, మహిళా సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లవకుమార్, ఎపిఓ శీరీష, ఎపిఎం గురు చరణ్, పంచాయతీ కార్యదర్శి రమ్య, వివో అధ్యక్షురాలు గట్టుపల్లి రజిత, ఐకేపి సిసి జ్యోతి, విఓఎ లత, వార్డు సభ్యులు, మహిళలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


