మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్ ముదిరాజ్, ఉప సర్పంచ్ కన్నా రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కూడా గాంధీ విగ్రహాలకు సర్పంచులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీకి అర్పించిన నివాళులు, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు సురగోని శేఖర్ గౌడ్, యాటసత్యలక్ష్మి యాదయ్య, ముల్కల వజ్రవ్వ కుంటయ్య, సామల సునీత మధు, లెంకలపల్లి హరీష్, బొడిగె సదానందం గౌడ్, రేగుల శ్యామల దేవయ్య, సరిత హరీష్, వాసుదేవచారి, దాసరి నాగరాణి ఎల్లయ్య, ఎర్ర భవాని నవీన్ కుమార్, గుండెల్ని భవాని వేణు నాగార్జున రెడ్డి, కుసుమ నిర్మల రవీందర్ రెడ్డి, రాజారెడ్డి, మోసర్ల శాంత మధుసూదన్ రెడ్డి, గంగ పరిషరాములు, కూర మధుసూదన్ రెడ్డి, గాలి పల్లి నవీన్, తాళ్లపల్లి స్వామి, బొల్లం భాగ్యలక్ష్మి చంద్రం, కుంభాల మనమ్మ; ఉప సర్పంచులు బేతి శంకర్, తప్పట అమరేందర్, రాగి నాగరాజు, ఏలేటి రవీందర్ రెడ్డి, యాదవ రెడ్డి, గోవింద గిరి స్వామి; ఏఎంసి డైరెక్టర్ అనుపాటి విజయ్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ కనకయ్య, వార్డు సభ్యులు, నాయకులు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.












