మండలం వడ్తాల్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ కరిపే రమేష్, ఉపసర్పంచ్ ఆడెపు సాయి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, వివిధ పార్టీల కార్యకర్తలు, గ్రామస్థులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గాంధీ సేవలను స్మరించుకున్నారు
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల నాయకులు పాల్గొన్నారు.












