జమ్మలమడుగు పట్టణంలో బంధువులు లేని వృద్ధుడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యంతో మరణించిన చౌడం వెంకటరమణ అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో స్థానికులు ఫౌండేషన్ ను సంప్రదించారు.
గుడుంచెరువు రాజీవ్ నగర్ లో నివసించే చౌడం వెంకటరమణ అనే వృద్ధుడు అనారోగ్యంతో మరణించారు. ఆయనకు బంధువులు ఎవరూ లేకపోవడంతో, అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో స్థానికులు వెంటనే మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ ను ఫోన్ ద్వారా సంప్రదించారు. ఫౌండేషన్ ప్రతినిధులు వెంటనే స్పందించి, ఈరోజు హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, నరేంద్ర, కిరణ్ కుమార్, అశోక్ కుమార్, సతీష్, సుబహన్ మరియు తదితరులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ తమ శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఈ క్రింది నంబర్లను సంప్రదించవలసిందిగా కోరుచున్నారు. సహాయం చేయాలనుకునేవారు 82972 53484, 9182244150 నంబర్లలో సంప్రదించవచ్చు.











