జమ్మలమడుగు పట్టణంలో అనారోగ్యంతో మరణించిన వృద్ధుడి అంత్యక్రియలను మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు నిర్వహించారు. బంధువులు ముందుకు రాకపోవడంతో, స్థానికుల అభ్యర్థన మేరకు ఈ మానవతా సేవను అందించారు.
గుడుంచెరువు రాజీవ్ నగర్ లో నివసించే చౌడం వెంకటరమణ అనే వృద్ధుడు అనారోగ్యంతో మరణించారు. ఆయన అంత్యక్రియలు చేయడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, స్థానికులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ ను సంప్రదించారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు, ఈరోజు హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా, ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, నరేంద్ర, కిరణ్ కుమార్, అశోక్ కుమార్, సతీష్, సుబహన్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ముందుకు వచ్చి సేవ చేయడం ప్రశంసనీయమని వారు అభిప్రాయపడ్డారు. అలాగే, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ తమ శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఈ క్రింది నంబర్లను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేసింది. దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందించాలని కోరింది. ఫోన్ నంబర్లు: 82972 53484, 9182244150.











