మిర్యాలగూడ పట్టణంలోని బీసీ భవన్లో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నియోజకవర్గం అధ్యక్షులు పిల్లలమర్రి రవి కుమార్, వ్యవస్థాపక కన్వీనర్ పున్న రాములు, మాజీ అధ్యక్షులు రాపోలు సత్యనారాయణ, బీసీ జేఏసీ కో-కన్వీనర్స్ దాసరాజు జయరాజు, చేగొండి మురళి యాదవ్, లింగంపల్లి చిరంజీవి, బీసీ జేఏసీ నాయకులు పున్న దయాకర్, గుర్రం యాదగిరి, నక్క సత్యం, కీర్తి అశోక్, పి. బీమయ్య, బి. నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


