వేములవాడ, 8 November
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేదలకు, అన్నార్తులకు మరియు భక్తులకు గత 2039 రోజులుగా నిరంతర అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. దీపావళి పండుగ సందర్భంగా కూడా అన్నదాన సేవలు ఆగకుండా నిర్వహించారు. దాతలు అందించే ప్రతి రూపాయి ఆకలితో అలమటిస్తున్న వారి కడుపు నింపడానికి ఉపయోగపడుతోందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేదలకు, అన్నార్తులకు మరియు భక్తులకు గత 2039 రోజులుగా నిరంతర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దాతలు అందించే ప్రతి రూపాయి, ఆకలితో అలమటిస్తున్న వారి కడుపు నింపడానికి ఉపయోగపడుతోందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. నేటి సమాజంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్న పరిస్థితుల్లో, మనకు ఉన్న దానిలో కొంత భాగాన్ని అవసరంలో ఉన్న వారికి పంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. మన పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, పితృదేవతల స్మరణ వంటి శుభసందర్భాలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం జరపడం ఎంతో పుణ్యమని తెలిపారు.
నేటి అన్నదాతలుగా కుంభం హన్సిక పుట్టినరోజు సందర్భంగా వీరి తల్లిదండ్రులు సత్యం, పద్మ దంపతులు, అన్నదాన శాశ్వత దాతలుగా జువ్వాడి వెంకటేశ్వరరావు, స్నేహలత, ప్రతాప స్వప్న, సంపత్, నగుబోతు రవీందర్, జ్యోతి, గణాచారి సాంబశిప్, శైలజ, దేవరాజు ఉమ, బాలచందర్ రాజు, రామడుగు శ్రీలత, వీరితో పాటు వీరి కుమారులు, కోడళ్లు ప్రజ్ఞ, శరత్చంద్ర, శిరీష, సాయిచంద్ర, శర్వాణి, రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులైన చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి దాతకు, ట్రస్ట్ సభ్యులకు, సేవలు అందిస్తున్న సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సేవాభావం కలిగిన వారు ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, అందరం చేయి చేయి కలుపుదామని, ఆకలిలేని సమాజ నిర్మాణానికి కృషిచేద్దామని, అంతేకాకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకుందామని, మానవత్వాన్ని చాటుదామని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వొడ్యాల వేణు, సగ్గు రాహుల్, పసుల శ్రీధర్, గొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.












