నిర్మల్, 2000-09-11
జిల్లా కేంద్రంలోని గాయత్రి కోపరేట్ అర్బన్ బ్యాంకు తన 26వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ బ్యాంకు నేటికి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరిగాయి.
ఘనంగా 26వ వార్షికోత్సవ వేడుకలు గాయత్రి కోపరేటివ్ బ్యాంక్ నిర్మల్ శాఖ.... నిర్మల్ మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా కేంద్రంలో గల గాయత్రి కోపరేట్ అర్బన్ బ్యాంక్ బ్యాంకులో 26వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ బ్యాంక్ నేటికీ 26 సంవత్సరాలు అవుతున్న తరుణంలో గాయత్రి బ్యాంక్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ గాయత్రి బ్యాంక్ వారి సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయని అలాగే మీ సహకారం, ఆదరణ, ఆశీస్సులతో, నమ్మకమైన బ్యాంకింగ్ సేవలు అందించే అవకాశం కల్పిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని మేనేజర్ రవికుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫీసర్ ప్రభాకర్ రాజు ఆనంద్ మధు బ్రాంచ్ స్టాఫ్ కలిసి జ్యోతి ప్రజ్వల చేశారు.. కస్టమర్లకు మరిన్ని సేవాదించడంలో బ్యాంకు ముందుంటుందని తెలిపారు












