మండలంలోని ధని గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మి చిన్నయ్య సాగు చేసిన పది కుంటల పత్తి పంట అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో పంట పూర్తిగా దగ్ధం కావడంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటకు నిప్పు అంటుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కళ్లముందే పంట కాలిపోవడంతో బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట అగ్నిప్రమాదంలో నాశనం కావడంతో కుటుంబం ఆందోళనకు గురైంది. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నారు.
సారంగాపూర్ మండలంలో అగ్నిప్రమాదం: ప
Share:

సారాంశం
పది కుంటల పత్తి పంట దగ్ధం
ముఖ్య విషయాలు
- గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మి చిన్నయ్య సాగు చేసిన పది కుంటల పత్తి పంట అగ్నికి ఆహుతైంది.
- మండలంలోని ధని గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది.
- ప్రమాదంలో పంట పూర్తిగా దగ్ధం కావడంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.
- పంటకు నిప్పు అంటుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4537ఆర్టికల్స్
5,43,549వ్యూస్










