శారదానగర్, బాసర (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
చేపలు పట్టేందుకు గోదావరి నదికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. బాసర శారదానగర్‌కు చెందిన బోయినవాడ్ దేవిదాస్ (38) బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గాలం వేసి ఒడ్డున కూర్చున్నాడు.
గోదావరిలో పడి వ్యక్తి మృతి చేపలు పట్టేందుకు గోదావరి నదికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. బాసర శారదానగర్‌కు చెందిన బోయినవాడ్ దేవిదాస్ (38) బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గాలం వేసి ఒడ్డున కూర్చున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రెండు కాళ్లు జారి లోతైన నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు బాసర సీఐ దీపక్ తెలిపారు. మృతుడి భార్య బోయినవాడ్ చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.












