మామడ మండలంలోని బురదపల్లి గ్రామ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మామడ మండలంలోని బురదపల్లి గ్రామ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరీకంటి గ్రామానికి చెందిన రాము (25), గూడెం సదేమియా (60) ఒక ద్విచక్రవాహనంపై నిర్మల్ వైపు వెళ్తుండగా.. తాండ్ర గ్రామానికి చెందిన భూమన్న (38) మరో ద్విచక్రవాహనంపై బురదపల్లి వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో బురదపల్లి సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ముఖాముఖి ఢీకొన్నాయి.
ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో.. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
108 సిబ్బంది ఈఎంటీ శేఖర్, పైలట్ విజయ్ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో సహకరించారని తెలిపారు.


